Tuesday, September 4, 2007

వాస్తవికావబోధన


ఇవాళ ప్రొద్దున్న రేతిఫైల్ బస్టాండ్ లో, ఉబుసుపోక, వేయింగ్ మిషన్ ఎక్కి ఓ రూపాయిబిళ్ళ దాని పొట్లో పడేసాను. అది బయటకు క్రక్కిన విషయం ఇది: 56.5 కిలోలు. వెనకాల: 'మీకు జీవితరహస్యం, కష్టాలు, సమస్యల యొక్క వాస్తవికావబోధన ఉంటుంది.' క్రింద ఇంగ్లీషులో: 'You have a true comprehension of life, its difficulties and problems.' నవ్వొచ్చింది. నిజంగా అంత క్లారిటీ యేడిస్తే భలే ఉండేది జీవితం.

The problem is, no matter how hard we try, we can't get a clear over view of this life, this chaotic mess. (Over view = అధివీక్షణ అనొచ్చా తెలుగులో?)


You don't know the future, can't retain the past and just have a fleeting comprehension of the present. You can never comprehend the life as a whole. It is simply as hopeless as that.

Oh boy! I sound like Sartre today. Better stop at this.

అసలీ గొడవంతా వదిలేస్తే, పై భవిష్యవాణి లిఖించిన వారెవరో, ఈ 'వాస్తవికావబోధన' అన్న పదబంధాన్ని ఎక్కడినుంచి ఏరుకొచ్చారో కనుక్కోవాలని ఉంది. True comprehension కి వచ్చిన తంటా అనుకుంటా.

2 comments:

రాకేశ్వర రావు said...

आप स्नेही, स्पष्टवादी, सुस्पष्ट तथा सत्यवादी हैं
అంటే
you are friendly, frank, outspoken and truthful.
అని మొన్నే తెలిసింది. :)

ఫణీంద్ర కుమార్ said...

To: రాకేశ్వర రావు,

That's funny. ఒక బాషలో ఆలోచిస్తూ ఒక బాషలో రాయడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఇదంతా. నిజానికి నాలోనూ ఈ లోపం కొంత ఉంది. అందుకే, ఈ సారి నా పుస్తకాల లిస్టులో తెలుగు పుస్తకాల శాతాన్ని భారీగా పెంచేసాను.