శూన్యచరితుడు
మృత్యువూ నేనూ కలిసి వైతరిణి దాటుతున్నాం.
నేను దిగాలుగా వెనక్కి చూసుకుంటూ నడుస్తున్నాను.
నా వాలకం చూసి అడగనే అడిగాడు -
"ఏం మిత్రమా, ప్రపంచమనే పసిడి పాత్రలో
జీవితపు అమృతాన్ని నింపి నిన్నాలోకానికి పంపాను,
ఎలా ఉంది అనుభవం?
బహుశా పూలవనాల మధ్య కోయిల పాటలు వింటూ,
వాసంత సమీరాల తేలివచ్చే చివురువాసనల్ని ఆఘ్రాణిస్తూ,
సంధ్యలూ, సంపెంగలూ, చినుకులూ, చిన్నిపాపలూ... ఓహ్,
వీటన్నిటి మధ్య ఆ విహ్వలానందాన్ని వెచ్చగా త్రాగి ఉంటావ్, అవునా?"
కన్నీరు దిగమింగుకుంటూ నేనన్నాను -
"ఇపుడర్థమౌతుంది ఎంత అజ్ఞానంతో బ్రతికానో,
ఈ సంఘం నాతో రాదన్న సంగతి ఎలా మరచిపోయాను!?
ఆ అమృతాన్ని వృధా చేసుకున్నాను.
సంఘపు బ్రహ్మజెముడు పొదల్లో చిక్కుకొని,
దాని వంచక విలువలు ముళ్ళై గీరుకుంటున్నా, రక్తం ఓడుతున్నా,
పూలవనాలవైపు పరిగెత్తే ధైర్యం చేయక,
మూసదారుల్లో మోసపోతూ,
రాబందులకు మొహమాటపు వాటాలర్పిస్తూ,
తోడేళ్ళకు రక్తపు విందులిప్పిస్తూ,
ఆ జీవితామృతాన్ని నిసృహతో త్రాగాను.
నాకది విషంలా అనిపించింది." అంటూ భోరుమని ఏడ్చాను.
మరొక్క ప్రత్యూషాన్ని ఇమ్మని, నిజంగా జీవించి వస్తానని బ్రతిమాలుకున్నాను.
మృత్యువు జాలిగా నవ్వాడు -
"ఏంటి మిత్రమా ఇలా చేసావ్,
నువ్వు అక్కడేం చేసినా చివరకు నా సమక్షంలో నిలబడి,
'నీవిచ్చిన బహుమతి నన్నానందపరిచింది' అని ఒక్కమాటంటే చాలా సంతోషించేవాడ్ని.
'ఆనందో బ్రహ్మ' అన్న చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయావ్?"
అంటూ అదృశ్యమయ్యాడు.
కాలగ్రంథంలో నేను బ్రతికిన క్షణాలు చిరిగిన పేజీలని అర్థమైంది.
విశృంఖలం
Planning. Planning. Planning.
To hell with it.
వట్టి సరళరేఖా జీవితాలు మనవి.
విహ్వల వివశానందాలకు బహుదూరాలు.
కొండ మీద విరగబూసిన మోదుగపూల చెట్టుని చూసి
గార్డెన్‌లో కత్తిరించిన క్రోటన్స్ వెక్కిరించాయట,
సరైన ప్లానింగ్ లేదని.
"ఏయ్ ఏంటీ? నవ్వితే నీ పెదవులు కొలతనుమించి విచ్చుకుంటున్నాయ్!
కొరతేస్తాం జాగ్రత్త." అంటున్నారు నాగరికులు.
వీళ్ళకు మూసలు కావాలి.
అందంగా కట్ చేసిన హృదయాలు కావాలి.
** ** **
శిఖరాల పచ్చదనంపై పడుకుని మబ్బులతో మాట్లాడుతున్నపుడు,
తలపై రాలిన తొలి వానచినుకు దారులు చేసుకువచ్చి చెంప తడిపినపుడు,
వెన్నెట్లో అమ్మ చారన్నం గోరుముద్దలు చేసిపెట్టిన క్షణాలు గుర్తొచ్చినపుడు,
గిటార్‌స్ట్రింగ్స్‌ని నేపథ్యంలో ఊహిస్తూ మార్క్‌నాఫ్లర్‌ని హమ్ చేస్తున్నపుడు,
జీవితంలో ఇలాంటి కొన్ని కొన్ని చిన్ని క్షణాల్లో
ఇముడ్చుకోలేనంత ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
ప్రపంచంతా వినబడేట్టు, ప్రతీ గుండె ఉలికి పడేట్టు
పగలబడి నవ్వాలనిపిస్తుంది.
పిచ్చోడనుకుంటారేమోనని మానేస్తాను.
(ఇవి ఎపుడో మూడేళ్ళ క్రితం రాసుకున్నవి. ఎక్కువసార్లు చదవడం వల్ల అసలు వీటికంటూ ఓ intrinsic worth ఉందా లేదా అనే జడ్జ్‌మెంట్ కుదరట్లేదు. బయటపెట్టని రచన, అది ఎంత చిన్నదైనా, గుండెలమీద కుంపటిలాంటి ఇబ్బందిని కలగజేస్తుంది. ఇపుడు నాకో మాధ్యమం దొరికింది, కాబట్టి బయటకు సాగనంపేస్తున్నాను.)

మొదటిది అన్నమాచార్యుల వైరాగ్య కీర్తనకి భాష్యం రాసినట్టుంది. మృత్యువు ప్రశ్న దాకా బానే ఉంది గానీ జీవుడిచ్చిన సమాధానంలో .. అతని బతుకులో అతను ఖచ్చితంగా దేన్ని నిస్పృహతో చూస్తున్నాడో స్పష్టం కాలేదు. చివర్లో నీతి మృత్యువు నోట explicitగా చెప్పడం అనవసరం .. ఇక్కడ మృత్యువు ఫీలింగ్స్ కాదు ముఖ్యం. మెరుగు పెడితే చాలా మంచి పద్యం అవుతుంది.
రెండోది .. హమ్మ్ .. దీన్ని గురించి చెప్పటం కష్టం. "తలపై రాలిన తొలి వానచినుకు దారులు చేసుకువచ్చి చెంప తడిపినపుడు," అన్న వరస బావుంది.
నేను విశ్లేషించలేను గానీ, ఈ భావాలు బాగున్నాయి. కొత్త పాళీగారి సూచన ఆచరణీయం.
To: కొత్త పాళీ ,
"... అతను ఖచ్చితంగా దేన్ని నిస్పృహతో చూస్తున్నాడో స్పష్టం కాలేదు.": నిస్పృహతో చూడడం కాదు, నిస్పృహతో జీవించడం. ఇక్కడ "నిస్పృహ" అనే పదం 'నిస్త్రాణ, అలసట'(Resignation)అనే అర్థంలో వాడలేదు. 'స్పృహ లేకుండా, యెరుకలేకుండా'(Unconscious, Oblivious)అన్న అర్థంలో వాడాను. అతను జీవితాన్ని,'జీవిస్తున్నానూ' అన్న స్పృహలేకుండా, జీవితాన్ని అర్థవంతంచేసే అసలు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరపుతో బ్రతికేసాడని చెప్పదల్చుకున్నాను. ఆ భావానికి 'నిస్పృహ' అన్న పదం తప్ప వేరే ప్రత్యామ్నాయం నాకు స్ఫురించలేదు. మీకు తడితే చెప్పండి. ఒకే పదం, క్లుప్తంగా.
"... చివర్లో నీతి మృత్యువు నోట explicitగా చెప్పడం అనవసరం ": నిజమే, మృత్యువు సమాధానాన్ని కొంచెం క్లుప్తపరిస్తే బావుండేదేమో. అవి రాసినప్పుడున్న మైండ్‌సెట్ (ప్రపంచాన్నుండి నన్ను నేను వెలి వేసుకుని, ప్రత్యేకతను ఆపాదించుకొనే మనఃస్థితి) ఇప్పుడు నాలో లేదు. అందుకే ఇపుడు మరలా రివైజ్ చేయాలనిపించలేదు.
పైన చెప్పిన 'జీవితాన్ని అర్థవంతం చేసే విషయాల్ని' కూడా specify చేయదల్చుకోలేదు. అలా చేస్తే అది మరీ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా మారిపోయి, ఎవరూ ఐడెంటిఫై చేసుకోలేరు. అందుకే, పూలవనాలూ, వాసంత సమీరాలంటూ రూపకాలంకారాలతో(Metaphors)సరిపెట్టేసాను.
చివరగా... అసలు కన్నా ఈ కొసరు ఆర్భాటం అధికమైతే మన్నించేయండి.
క్రాప్!
చెప్పడానికి పదాలు లేనప్పుడు నేను ఆలా సంబోధనా విభక్తి వాడుతూంటాను. :)
చాలా చాలా బాగున్నాయి.
కొత్త పాళీ గారు "అతని బతుకులో అతను ఖచ్చితంగా దేన్ని నిస్పృహతో చూస్తున్నాడో స్పష్టం కాలేదు." అని అనడంతో నేను ఏకీభవించను.
అతని జీవితమంతా నిఃస్పృహే. There was something fundamentally wrong with the way (s)he lived అని అర్థంచేసుకోవచ్చు.
వీళ్ళకు మూసలు కావాలి.
అందంగా కట్ చేసిన హృదయాలు కావాలి.
అతిశయం! తిలక్ ని తలపించారు.
పగలబడి నవ్వాలనిపిస్తుంది.
పిచ్చోడనుకుంటారేమోనని మానేస్తాను.
బాగుంది. కలీల్ గిబ్రాన్ను తలపించారు.
ఇలా మిమ్మల్ని ఇతరులతో పోల్చడం తప్పుగా అర్థంచేసుకోవద్దు. నా ఉద్ధేశం చాలా బాగున్నాయి అనే.
ఎందుకు ప్రత్యేకించి చెబుతున్నానంటే, మా తెలుగు మాస్టారు కవితల్ని ఎవరో ఎంకి పాటల్లా వున్నాయంటే, వాటిని అతని ముందే చింపేశారంట ! :)
మీరా పని చేయవద్దు.
To: రాకేశ్వర రావు,
Well... What can I say... THANK YOU.
నా శ్రీశ్రీ స్ఫూర్తీ మఱియూ నా తిలక్ స్ఫూర్తీ చూడగలరు.
బాగున్నాయండీ
To: రాకేశ్వర రావు,
మీ 'నిరుద్యోగులు', 'బెంగుళూరు మారిపోయింది' బావున్నాయి.
తొందరగా సొంతబాణీ కొచ్చేయండి.
వీలైతే శేషేంద్రను కూడా చదవండి.
ముగింపు తప్ప అంతా చాలా బాగుంది.
మనం దేని కోసమో వెతుకుతూ, చుట్టూ ఉన్న వాటిని మన దుఃఖానికి కారణాలు చేసుకుంటూ, జీవితాన్ని జీవించలేకపోతున్నామన్నది కఠోర సత్యం. మళ్ళీ మళ్ళీ చదువుతుంటేనన్నా స్పృహలోకి వస్తామేమో.
ఒక సారి twilight zone లో ఒక కథ. అందరూ హడావిడిగా రైలు ఎక్కుతుంటారు. ఒక్కతను మాత్రం సంశయిస్తుంటాడు. నిజానికి భయపడ్తాడనుకుంటా. ఆఖరు క్షణంలో ధైర్యం చేస్తాడు కాని అందుకోలేకపోతాడు. నిజానికి ఆ రైలు జీవితం. మొట్ట మొదటి సారి నన్ను ఆ నిజం ఉలిక్కిపడేలా చేసింది. కానీ ఇప్పటికీ నేను జీవితాన్ని పూర్తిగా అందుకోలేకపోతున్నాను.
మీ కవిత ఇంకో మేలుకొలుపు, ఇంకో ఉదయం అవుతుందేమో, చూస్తాను:-)
పై వ్యాఖ్య "శూన్య చరితుడు" గురించి అని అర్థం చేసుకోగలరు.
నిజానికి నేను ఉదహరించిన కథకీ, మీరు వ్యక్త పరిచిన భావానికీ, జీవితం అందుకోవడం అన్న పోలిక ఒక్కటే నిజమైన పోలిక. రెండూ వేరు వేరు కోణాలనుకుంటా.
>>అందంగా కట్ చేసిన హృదయాలు కావాలి.
బాగా చెప్పారు.