Wednesday, August 15, 2007

మేనిఫెస్టో


1. ఈ బ్లాగ్ లో ఏమి రాయాలన్న విషయంపై నేను ఎటువంటి పరిమితులూ విధించుకోలేదు. ఒక్కోసారి హృదిగదుల్లో, చీకటి మూలల్లో ఏవేవో భావాలు - అక్షరాల అంగీలు, పదాల పట్టుపంచెలూ ధరించి "మేమూ ఉన్నామంటూ" సందడి చేస్తాయి. నాకైతే వీటి భాధ మరీ ఎక్కువై పోయింది. వీటిని బయటికి తన్ని తరిమేయడానికి నాకీ బ్లాగింగ్ ఒక మంచి ఉపాయం లా కనిపిస్తుంది. ఇంతవరకూ తెలుగులో బ్లాగింగ్ చేసే సదుపాయం ఉందని తెలియదు. నేను ఇంగ్లీషు లో రాయగలను. కానీ ఎపుడు ప్రయత్నించినా, నా భావాల జెట్ వేగంతో నా ఇంగ్లీషు పరిజ్ఞానం పోటీపడలేక వెనకనే చతికిలపడుతుంది. (ఎంతైనా అరువు తెచ్చుకున్న భాష, అమ్మ నేర్పిన భాషతో ఎలా సాటిరాగలదు!)


2. నా అంతరంగపు భావతరంగాల్ని ఈ బ్లాగ్ ద్వారా ఏ మేరకు బహిరంగం చేయవచ్చు, ఎంతవరకూ నాకై నేను మిగుల్చుకోవాలి అన్న విషయమై నేనింకా ఒక నిశ్చయానికి రాలేదు. అసలు నా నిశ్చయం సంగతి ఎలా ఉన్నా, చదువరుల్లో నిశితపరిశీలకులైన వారికి అక్షరాలమాటున దాగివున్న నన్ను తూకంవేసి లెక్కగట్టేయడం ఏమంత కష్టంకాదు. అదేమంత భయపడాల్సిన విషయమూ కాదు. తనని తాను బయటపెట్టుకోవడానికి వెరచేవాడెవడూ రచన చేయలేడు. (అయితే... ఒక రచన యొక్క పరమార్థం రచయిత తనని తాను వెలిబుచ్చుకోవడం మాత్రమే అయిఉండకూడదని నా అభిప్రాయం.) ఈ బ్లాగ్ నన్ను నేను బయట పెట్టుకోవడానికో, నా భావాలను పదుగురితో పంచుకోవడానికో, గుర్తింపు కోసమో, ఏదో మార్పు తీసుకురావడానికో రాయడం లేదు. ఈ బ్లాగ్ ని కేవలం చదవబడటం కోసం మాత్రమే రాస్తున్నా. I just want it to be read... that's all.



3) ఇక నా శైలివిషయమై కొన్ని వివరణలు: రాసేది గద్యమైనా పదాలలో ప్రాసకోసం ప్రయాసపడటం నాకున్న పాత జబ్బు. (ఈ వాక్యమే నిదర్శనం.) ఎంత వదిలించుకోవాలన్నా నావల్ల కాలేదు. దీనివల్ల శైలి కొంత కృతకంగా అనిపించినా బ్లాగానుభావులు... భరించేయండి! మస్తిష్కంలోకి చొచ్చుకుని వచ్చే ఇంగ్లీషుపదాల్ని నివారించి, అయినంతలో తెలుగులోనే రాయాలన్న నిశ్చయంతో ఉన్నాను. దీనికి ఎంతవరకూ నిబద్దుడనై ఉంటానన్న విషయంలో నా అనుమానాలు నాకున్నాయి. (అసలు నా భావాలకీ, తెలుగు భాషకి మధ్య కంపేటబిలిటీపైనే నాకు అనుమానం; బహుశా నా తెలుగు పరిజ్ఞానానికున్న పరిమితులవల్ల కావచ్చు.)


4) చివరగా చిన్న 'డిస్ క్లెయిమర్ ' లాంటిది: నేను ఎక్స్ క్లూజివ్ గా ఏ వాదానికీ చెందను. ఈ బ్లాగ్ ద్వారా ఏమైనా అభిప్రాయాలు, వాల్యూజడ్జిమెంట్స్ లాంటివి వెలిబుచ్చడం జరిగితే అవి నా వ్యక్తిగత భావనలు మాత్రమే. వాటికై నేను ఎవరి సమర్థింపునూ లేదా విమర్శనూ ఆశించడంలేదు. అంతేకాదు ఒక సంచికలోని నా అభిప్రాయాన్ని మరోసంచికలో నేనే సవరించవచ్చు లేదా ఖంఢివచ్చు. ఈ విషయమై నాకునేను ఏ పరిమితులూ వింధించుకోలేదు. ఈ ప్రపంచంచంలో సార్వజనీన, సార్వకాలీన సత్యాలంటూ ఏమీ ఉండవు. సమయాన్ని, సందర్భాన్నీ, వ్యక్తుల్నీబట్టి సత్యమూ పరిణామంచెందుతుంది. నాకు నిజమనిపించింది నేనురాస్తాను. అదే ఈ బ్లాగ్ ప్రక్రియలో వెసులుబాటు కూడా.

9 comments:

విహారి(KBL) said...

మంచిది బ్లాగ్ లోకానికి స్వాగతం.

Sudhakar said...

Your manifesto sounds very cool...very much similiar to mine :-) welcome to the world of freespeech :-)

Bhanu said...

ఫణీంద్ర గారు,

నా వెన్నెల కవిత పై మీ అభిప్రాయం చదివి మీ బ్లాగు చూద్దామని వచ్చా. మీ మొదటి పోస్ట్ నుండీ అన్నీ చదివా. మీ ఆలోచనల్లొ చాలా maturity ఉంది."జీవితం కన్నా కలలే colourfulగా ఉండడం జాలిగొలిపే విషయం కదూ."ఎంత బాగా చెప్పారు!by the way, నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

భాను

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

తెలుగు బ్లాగింగుకు స్వాగతం.

Nagaraju Pappu said...

హూఁ...
మిమ్మల్ని మీరు పదునుపెట్టుకోడనికి ఉపయోగిస్తున్న నలుగుపిండిని ఉండలా చుట్టి, ఈ అంతర్జాలమనే అనంత ప్రవాహంలోకి గిరవాటేస్తున్నారన్నమాట - కాని అది మా పాలిట రుచికరమైన హల్వానే లెండి.

ఇప్పుడే మరోసారి మీ బ్లాగంతా చదివి ముంగించా. ఈ వ్యాఖ్య ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నా:

మీరు జార్జి లూయీ బోర్జెస్ రచనలు చదివారా? వాటిల్లో కొన్నిటినైనా తెలుగులోకి అనువదించమని మనవి. నే చేద్దామనుకొన్నాను గాని - మీరే సరైన వారు.
ఛీర్స్,
నాగరాజు
http://canopusconsulting.com/salabanjhikalu

ఫణీంద్ర కుమార్ said...

To: Nagaraju Pappu,

బోర్జెస్ రచనల్ని నేను కొన్నే చదివాను. మొన్నే Ficciones ఆర్డర్ ఇచ్చాను. ఈ నెలాఖరుకి వస్తుంది బహుశా.

ఇక అనువాదమంటారా—బోర్జెస్ లాంటి రచయితల్ని అనువదించేటపుడు ముఖ్యంగా తెలుగు భాషకున్న పరిమితుల్ని అర్థం చేసుకోవాలి. బోర్జెస్ ప్రతీ పదానికీ ప్రత్యేకమైన విలువ ఇస్తాడు. బాష విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఉదాహరణకు ఆయన ఓ ఇంటర్వూలో ఇచ్చిన కొన్ని సమాధానాలు చూడండి:

Interviewer: Do you think of words as having effects that are inherent in the word or in the images they carry?

Borges: Well yes, fro example, if you attempt a sonnet, then, at least in Spanish, you have to use certain words. There are only a few rhymes. And those of course may be used as metaphors, peculiar metaphors, since you have to stick to them. I would even venture to say—this of course is a sweeping statement—but perhaps the word moon in English stems from something different that the word luna in Latin or Spanish. The moon the word moon is a lingering sound. Moon is a beautiful word. The French word is also beautiful: lune. But in Old English the word was mona. The word isn't beautiful at all, two syllables. And then the Greek is worse. We have celena, three syllables. But the word moon is a beautiful word. That sound is not found, let's say in Spanish. The moon. I can linger in words. Words inspire you. Words have a life of their own.

Interviewer: The word's life of its own. Does that seem more important than the meaning that it gives in a particular context?

Borges: I think that the meanings are more or less irrelevant. What is important, or the two important facts I should say, are emotion, and then words arising from emotion. I don't think you can write in an emotionless way. If you attempt it, the result is artificial. I don't like that kind of writing. I think that if a poem is really great, you should think of it as having written itself despite the author. It should flow.

Interviewer: Does changing from Spanish to English to German or Old English seem to offer you different means of viewing the world?

Borges: I don't think languages are essentially synonymous. In Spanish it is very difficult to make things flow, because words are over-long. But in English, you have light words. For example, if you saw slowly, quickly, in English, what you hear is the meaningful part of the word: slow-ly, quick-ly. You hear slow and quick. But in Spanish you say lentamente, rapidamente, and what you hear is the –mente. That is gratis, so to say. A friend of mine translated Shakespeare's sonnets into Spanish. I said that he needed two Spanish sonnets to a single English one, since English words are short and to the point, but Spanish words are over-long. And English also a physical quality to it. Well, in English, you can say: to explain away. In Kipling's Ballad of East and West, an English officer is pursuing an Afgan horse thief. They're both on horseback. And Kipling writes: They have ridden the low moon out of the sky./ Their hooves drum up the dawn. Now you can't ride the low moon out of the sky in Spanish, and you can't drum up the dawn. It can't be done. Even such simple sentences as he fell down or he picked himself up, you can't do in Spanish. You have to say he got up the best he could or some lame paraphrase. But in English you can do much with verbs and positions. You can write: dream away your life; live up to; something you have to live down. Those things are impossible in Spanish. They cannot be done. Then you have compound words. For example you have wordsmith. It would be in Spanish un herrero de palabras, rather stilted, rather uncouth. But it can be done in German you can make up words all the time, but not in English. You are not allowed the freedom that the Anglo-Saxons had. For example, you have sigefolc, or victorious people. Now in Old English, you don't think of these words as being artificial, but in Spanish it can't be done. But of course, you have what I think is beautiful in Spanish: the sounds are very clear. But in English you have lost your open vowels.

ఇక్కడ ఆయన అనువాద ప్రక్రియలో స్పానిష్ బాషలో ఎదురయ్యే లోటుపాట్ల గురించి చెపుతున్నాడు; ఇవే తెలుగులో కూడా ఎదురవుతాయని నా నమ్మిక. అయినా ప్రతీ పదాన్ని ఇలా ఆచి-తూచి రాసే వారిని అనువదించడం కత్తిమీద సామే. అతికష్టం మీద మన తెలుగు బాషనంతా తిరగమోత వేసి, ఖచ్చితమైన పదాల్ని వెతికి పట్టి, ఒక ప్రామాణికమైన అనువాదాన్ని తయారు చేయగలిగినా, అది శుద్థ గ్రాంథికంలా కనబడి, చదువరులకు అర్థంకాక, ఎటూ కాకుండా పోతుంది.

గిడుగువారు తన "వ్యావహారిక బాషోద్యమపు" ఫలితాల్ని ఈనాడు చూసి ఉంటే, "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింద"ని ఖచ్చితంగా వాపోయి ఉండేవారు. ఆయన తెలుగు బాషను "ఛందస్సుల కబంధ హస్తా"ల్లోంచి రక్షించాలనుకున్నారు; బాషను పండితుల చేతుల్లోంచి విడిపించి ప్రజలకు అప్పగించా లనుకున్నారు. కాని ఇపుడు ప్రజలు దాన్ని తేరగా ఆంగ్ల భాష చేతుల్లోకి నెట్టేస్తున్నారు. మార్పుకు వాపోవడం వాజమ్మల లక్షణం... కాబట్టి వదిలేద్దాం.

నా రెండో అభ్యంతరం: బోర్జెస్ ప్రధానంగా స్పానిష్ బాషలో రాసారు. ఇపుడు మనం ఇంగ్లీషు నుండి అనువదించినా అది థర్డ్ హాండ్ ప్రొడక్టే అవుతుంది.

ఇదిగాక, నా అనువాద ప్రతిభ పై కూడా నాకు చాలా అనుమానాలున్నాయి.

ఫణీంద్ర కుమార్ said...

పై ఇంటర్యూ కు లింకు: http://www.wooster.edu/artfuldodge/interviews/borges.htm

Nagaraju Pappu said...

నేనీ ఇంటర్వ్యూ చదివాను. మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. బోర్హెస్‌ (ఆర్జెంటీనాలో ఆయన పేరుని హోర్హె లూయీ బోర్హెస్ అని పిలవాలట. అక్కడ్, జె కాస్త హ అవుతుంది కదా..)
బోర్జెస్‌ని తెలుగులోకి అనువదించడం అంత కష్టం కాదనుకొంటా. ప్రస్తుతం, సామాజిక నిస్ప్రుహలోనూ, సందేశాత్మాక విలువలల్లోనూ కొనవూపిరితో కొట్టాడుతున్న తెలుగు కథకి కొన్ని ఒరజినల్‌ కథావస్తువులు దొరుకుతాయి, ఆయన అనువాదాలు తెలుగులోకి వస్తే.

మీరు వర్డ్‌ వెరికేషన్ తీసెస్తే, ఎనానిమస్స్ కామెంట్లని కూడ తీసెయ్యండి. లేకపోతే, చాలా ఆటోమేటెడ్‌ ప్రోగ్రాముల ద్వారా మీకు చచ్చేటన్ని జంకు కామెంట్లు (వయాగ్రా ఎడ్వర్‌టైజ్‌మెంట్లలాటివి) కుప్పతెప్పలుగా వచ్చి పడతాయి.

--నాగరాజు

ఫణీంద్ర కుమార్ said...

To: Nagaraju Pappu,

"బోర్హెస్"! తెలిపినందుకు ధన్యవాదాలు. నేను కామూని కూడా చాలా కాలం కామూస్ అని పొరబడ్డాను.

అనువాదం విషయంలో—నా దృష్టిలో—ఒరిజినల్ టెక్స్ట్‌కు నిబద్దత వహించి రాయాలంటే కొంత కష్టమే. Paraphrase చేసి రాస్తే అది రచయితకు చేసిన అన్యాయం అవుతుంది.

మీకు ఉపయోగపడవచ్చు నేమోనని ఈ లింకులు ఇస్తున్నాను. ఇద్దరు ప్రముఖ అనువాదకులు వాళ్ళ అనువాద పద్దతుల గురించి మాట్లాడుతున్నారు:

- గ్రెగొరీ రబ్బాసా: http://www.udel.edu/LAS/Vol7-2Brown.html
- ఎడిత్ గ్రోస్‌మన్: http://www.themodernword.com/gabo/gabo_PEN_grossman.html

అయితే వర్డ్ వెరిఫికేషన్ ప్రారంభించడమే మంచిదనుకుంటా; నాకు అనానిమస్ కామెంట్లు కొన్ని చాలా విలువైనవి వస్తుంటాయి.