Monday, December 1, 2008

నమ్మకం

ప్రేమకు పర్యవసానం లేకుండా పోదు ప్రియతమా!

ఎక్కడో, తన ప్రేయసికి గులాబీతో ప్రేమ నివేదిస్తూ

ఆమె ముందు మోకరిల్లడానికి జంకుతున్న అబ్బాయికి

నా ప్రేమ మోకరిల్లే తెగింపునిస్తుంది;

ఇంకెక్కడో, తన ప్రియుడు గట్టు పైనుండి చేయి చాపితే

ఆ ఆసరా అందుకోవడానికి బిడియపడుతున్న అమ్మాయికి

నా ప్రేమ చేయి కలిపే చొరవనిస్తుంది.

ఎవరిదాకానో ఎందుకు —

నిశి వేళ నిద్రలో నీ పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటే,

ఆ కళ్ళ వెనుక కల అల్లిక నా ప్రేమే.

సాయంత్రపు నడకలో నీ మీద ఓ మోదుగపువ్వు రాలితే,

దాన్ని రాల్చిన చినుకు భారం నా ప్రేమే.

రోజువారీ రంధిలో ఓ పసిపాప నీకు బోసినవ్వు వరమిస్తే,

ఆ దయ దాపున రహస్యం నా ప్రేమే.

అందుకే అంటున్నాను,

నీదాకా చేరనంత మాత్రాన

నా ప్రేమకు పర్యవసానం లేకుండా పోదు ప్రియతమా!


రచన: ఫణీంద్ర at 6:46 PM

10 comments:


Sreenivas Paruchuri said...
ఫణీంద్ర-గారు,ఈ రెండు అనువాదాలకీ ఫ్రెంచ్ మూలం + ఒకవేళ మీరు ఇంగ్లీషు నుండి అనువాదం చేసుంటే ఆ version ఇవ్వగలరా!Thanks, Sreenivas
December 1, 2008 11:53 PM


కొత్త పాళీ said...
చాలా బావుంది.
December 2, 2008 6:33 AM


ఫణీంద్ర said...
శ్రీనివాస్ గారు,రాండమ్‌గా బ్రౌజ్ చేసుంటే తగిలాయి ఈ రెండు కవితలూ. లింక్ ఇప్పుడు నా దగ్గిర లేదు. వెతికాను దొరకలేదు.
December 2, 2008 9:48 AM


డా.ఇస్మాయిల్ said...
"నిశి వేళ నిద్రలో నీ పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటే,ఆ కళ్ళ వెనుక కల అల్లిక నా ప్రేమే..." I don't know the original, but your translation is awesome!
December 4, 2008 5:08 AM


రాకేశ్వర రావు said...
చాలా బాగుంది.I like these cinema-type poems, they give you a grand opening statement (like a murder scene), then they take you on a flashback.And in the end, Bam! that's what the beginning was about.సూచన- బ్లాగులో ప్రచురించేడప్పుడు, మధ్యలో తగిన చోట్ల లైను స్పేసులు ఇస్తే చదువర్లకు ఇంకా సౌకర్యంగా వుండవచ్చు.
December 4, 2008 5:11 PM


ఫణీంద్ర said...
రాకేశ్వరరావు గారు,Thanks. ఇంతకీ ఇదేనా మీరన్న లైన్ స్పేసింగ్? మీ ఉద్దేశ్యం పేరాగ్రాఫ్ స్పేసింగ్ అయితే ఈ కవితకు అది అవసరం లేదు.
December 4, 2008 7:26 PM


teresa said...
Beautiful!
December 4, 2008 9:27 PM


రాధిక said...
చాలా చాలా బావుంది.
December 4, 2008 9:45 PM

బొల్లోజు బాబా said...
నీదాకా చేరనంత మాత్రాననా ప్రేమకు పర్యవసానం లేకుండా పోదు ప్రియతమా!అన్న వాక్యం కవితను రెండు సార్లు చదివించింది.గొప్ప అల్లికగొప్ప థాట్.ధన్యవాదములు
December 5, 2008 7:57 PM


Dr.Ismail said...
Cheerfully immoral :-)
December 8, 2008 2:58 PM

No comments: