Wednesday, December 24, 2008

Still the same old me!


ఉబుసుపోక మళ్ళా కాఫ్కా డైరీలు తిరగేస్తుంటే ఎప్పుడో నాల్గేళ్ళ క్రితం నేను అండర్‌లైన్ చేసుకున్న ఈ మూడు వాక్యాలు కనిపించాయి. ఎవరైనా ఒక పుస్తకంలో దేన్నైనా ఎందుకు అండర్‌లైన్ చేసుకుంటారు? ఏమో, నేను మాత్రం ఈ వాక్యాల్లో నన్ను చూసుకున్నాను కాబట్టి అండర్‌లైన్ చేసుకున్నాను. హ్మ్, యేళ్ళైతే గడుస్తున్నాయిగానీ, పరిస్థితులేం మెరుగు పడలేదు:

  • Recently, when I got out of the elevator at my usual hour, it occurred to me that my life, whose days more and more repeat themselves down to the smallest detail, resembles that punishment in which each pupil must according to his offence write down the same meaningless (in repetition, at least) sentence ten times, a hundred times or even oftener; except that in my case the punishment is given me with only this limitation: ‘as many times as you can stand it.’

  • What I said was true and was acknowledged to be true: each loves the other person as he is. But doesn’t think it possible to live with him as he is.

  • The difficulties (which other people surely find incredible) I have in speaking to people arise from the fact that my thinking, or rather the content of my consciousness, is entirely nebulous, that I remain undisturbed by this, so far as it concerns only myself, and am even occasionally self-satisfied; yet conversation with people demands pointedness, solidity, and sustained coherence, qualities not to be found in me. No one will want to lie in clouds of mist with me, and even if someone did, I couldn’t expel the mist from my head; when two people come together it dissolves of itself and is nothing.

(అయితే మాట్లాడడం విషయంలో ఈ మబ్బు అన్నది నాకు ఒక కారణం మాత్రమే. ముఖ్యమైందేంటంటే, ఏం సంభాషణ మొదలు పెట్టబోయినా వెంటనే నా మెదడులోకి "Does it matter" అన్న ప్రశ్న చొరబడిపోతుంది. దానికి నేనిచ్చే సమాధానం దాదాపు ఎప్పుడూ "ఊహూ"నే!)

ఈ మధ్యన మళ్ళా కాఫ్కా మీద పడ్డాను. మొన్న పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకాల్లో నికొలాస్ ముర్రే రాసిన "కాఫ్కా" బయోగ్రఫీ ఒకటి; ముందు చదవడం మొదలు పెట్టిన పుస్తకం కూడా ఇదే. ఒక్కోసారి నాకు కాఫ్కా రచయితగా కన్నా కూడా వ్యక్తిగానే ఎక్కువ ఆసక్తేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కొన్న పుస్తకాల్లో మొదటి బయోగ్రఫికల్ పుస్తకం ఇదే. ఇవాళే కాఫ్కా ఉద్యోగంలో చేరడమైంది; బహుశా రేపే ప్రేమలో పడతాడేమో. ఈ పుస్తకం అయ్యాక మొత్తం కాఫ్కానంతా మళ్ళా ఒకసారి తిరగేయాలన్న ఆలోచన ఉంది. మరో ప్రక్కన, ముట్టుకోను కూడా ముట్టుకోకుండా కొని అరలో పడేసిన పుస్తకాలు లెక్కకు మించిపోతున్నాయ్. ఎవడన్నా చూస్తే పుస్తకాల విషయంలో నాది స్టాంపు కలెక్షన్‌లా ఓ సేకరణాభిలాష అనుకుంటాడతే.

3 comments:

కత్తి మహేష్ కుమార్ said...

కాఫ్కా short stories కూడా చదివెయ్యండి. నాకైతే metamorphosis ది బెస్ట్ అనిపిస్తుంది.

Anonymous said...

>> పుస్తకాల విషయంలో నాది స్టాంపు కలెక్షన్‌లా ఓ సేకరణాభిలాష అనుకుంటాడతే

ahem!!

ఫణీంద్ర said...

మహేష్‌గారు, కాఫ్కావి ఉత్తరాలు తప్ప ఇంకేం బాకీ లేవు. నవలలు, కథలు అన్నీ చదివేశాను.